Food - Power - Fascism
meeting on 06th nov 2015, 6pm @ Lamakaan, Hyderabad ఆహారంపై నిషేదం. ఆలోచనలపై నిషేదం. విశ్వాసాలపై నిషేదం. ఆంక్షల నుంచి హత్యల వరకు... అధికారం కొనసాగిస్తున్న సాంస్కృతిక ఆధిపత్యం. వేయి పడగల హైందవం చిమ్ముతున్న విషం. అది బాబ్రీ మీదుగా.. గుజారాత్‌లను.. కందమాల్ లను... ఖైర్లాంజీలను.... ముజఫర్ నగర్‌లను... దాద్రిలను దాటుకొస్తోంది. బహుళత్వాన్నిధ్వంసం చేసి... ఆధిపత్య సంస్కృతిని పదిలం చేసుకుంటోంది. అక్షరాలను శిలువ వేసి.. ఆలోచనల్ని ఖైదు చేసి... డిజిటల్ ఇండియా మంత్రం జపిస్తోంది. ఇది అక్కడితో ఆగి పోదు... మన వంట గదిలోకి చొరబడ్డమే కాదు... మొత్తంగా మనల్నే కబ్జా చేస్తుంది. అది పెచ్చరిల్లుతున్న హిందూ ఫాసిజం. దాన్ని.. ముక్తకంఠంతో ఎదుర్కోవలసిందే. ప్రజాస్వామ్య హక్కుల కోసం... కవులు, కళాకారులు, రచయితలు, ఆలోచనా పరులు ఐక్యంగా ఉద్యమించాల్సిందే. రండి.. హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా గళం విప్పుదాం. ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతను చాటుదాం. ఈ నేపథ్యంలో హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా విరసం నిర్వహస్తున్న సమావేశంలో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ రామ్ పునియాని, ప్రముఖ కవి, రచయిత్రి, వరవరరావు (విరసం), యాకూబ్ (సెక్యులర్ డెమోక్రటిక్ లిటరరీ అండ్ కల్చరల్ ఫోరం)లు 'ఆహారం - అధికారం - సాంస్కృతిక ఆధిపత్యం' అనే అంశంపై ప్రసంగించనున్నారు. కార్యక్రమానికి విరసం సభ్యురాలు గీతాంజలి అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా హిందూ ఫాసిజం పై విరసం కవిత్వం ఫోల్డర్ ఆవిష్కరణ ఉంటుంది.