I am your poet -Story of Vidrohi
Movies
1.0 hrs
December 13, 2015 6:00 pm Sunday
image

Screening a film on and about poetry of Ramashankar Yadav "Vidrohi" who passed away this week in JNU, Delhi. The film is made by Nitin K Pamnani.

There is a poet on the streets of Delhi called ‘Vidrohi’ – the rebel. He roams around the old city, spouting Molotov cocktails of words.The citizen name of the ‘Vidrohi’ is Ramashankar Yadav, a raggedy old man from Sultanpur. Vidrohi is a title that has been conferred to Indian poets before, such as Kazi Najrul Islam and Damodar Swarup, but has it had such an organic development so as to overshadow the real name.

The subjects of his poems deal with universal struggle and suffering, imbued with socio-political perspectives. He uses historical places, times and names to constitute his subjects with historical relevance. There is a history behind each system of oppression and a game of constant manipulation to make people forget that history. Vidrohi’s poems fight against the politics of re-memory and re-interpretation by retelling and reconstructing the discourse of suffering.

His poems are mostly composed in Hindi. He uses everyday phrases in his poems to make them comprehensible to people from all walks of life, but even with ordinary words he creates powerful images, like a burnt corpse of a woman lying on the last step of Mohenjodaro, her corpse embodying the history of continuous exploitation and violence committed by imperialist powers all over the world. He also writes about the interconnectedness of class and gender oppression. Each of his poems deal with one powerful image around which he constructs the narrative. Ramashankar Yadav is a people’s poet, a rebel at heart who carries on the legacy of poets like Kabir and Nagarjun. He spends most of his time around Delhi and inside Jawaharlal Nehru University’s campus. A former student of JNU, he was rusticated from the University for being part of a mass movement in the 80s. It was after this incident that he started living under the trees inside the campus. Away from his faraway home and wife, Vidrohi has chosen the life of a vagabond, roaming around with his bag full of the poetry of rebellion. There is no bitterness between his family members and himself for his chosen lifestyle of living on the streets. He lives off people’s kindness, living by the people he writes for, of which JNU students play a crucial part.

This film was to be on a poet and his poetry. It became a story of a person who lives a poem. We try to understand the person we see the poem, we try to understand the poetry; the poet comes and stands in front of us. And as we journey through the poetry and the poet, we end up with a mirror. In the mirror, a roughly-hewn life, small, innocent.... a dream-like existence, in the scrub forest, among the silent ruins, the old streets in the middle of the polis.

The poetry slowly shows us the way, and the way slowly becomes poetry Ramashankar Vidrohi has never written poetry, he speaks out poetry. He is poet of our unknown, unorganized, underground nation. He is the poet of those whose constituency is always bearing the cost of empire builders, the women, the children, and the billions who lie on the steps to the center of power structure.

Film has won International Award for Best Documentary at MIFF ( Mumbai International Documentary Festival 2011).

అది... ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్. వసతి గృహాలకు దూరంగా... దట్టమైన చెట్లపొదలు. ఓ చెట్టు కొమ్మకు ఏవో ప్లాస్టిక్ సంచులు వేలాడుతున్న‌యి. చెట్టు కింద... నిండా కంబలి కప్పుకొని నిద్రిస్తున్న మనిషి ఒకరు. పక్కన ఖాళీ సిగరేట్ పెట్టెలు. పక్షుల కిచకిచ శబ్ధాల నడుమ అతను నిద్రలేచాడు. ముడతలు పడిన శరీరం.... మురికి బట్టలు... బక్కపలచని దేహం. అతను గడిచిన మూడు దశాబ్ధాలుగా ఆ చెట్టు కిందే జీవిస్తున్నాడు. పేరు రాం శంకర్ యాద‌వ్‌(విద్రోహి). వయసు 50ఏళ్లపైనే ఉంటుంది. విద్యార్థులు ఉండే విశ్వవిద్యాలయంలో ఇతనేం చేస్తున్నాడనుకునేరు. ఆయన నిరంతర విద్యార్థి. 80ల్లో విద్యార్థిగా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టాడు. జీవితమంటే చదువొక్కటే కాదు... పోరాటం కూడా అని నమ్మాడు. చివరి వరకూ న‌మ్మిన‌దాన్నే ఆచరించాడు. అవును... ఆ విద్యాలయంతో మూడు పదుల అనుబంధాన్ని చాలించుకొని డిసెంబ‌ర్ 8న‌ తుదిశ్వాస విడిచాడు.

విద్రోహి సాధారణ విద్యార్థి మాత్రమే కాదు.. అతనో కవి.. సాంస్కృతిక కార్యకర్త. క్యాంపస్ లోప‌ల, బయట... ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. కవితా ప్రవాహాన్ని వెంట మోసుకెళ్తాడు. అలుపెరగని ఆ కవితాఝురికి ʹబ్రెయిన్ డెడ్ʹ బ్రేక్ వేసింది.

అతని కవిత్వం.. వివక్షను సవాల్ చేస్తుంది. సమాజపు వెకిలితనాన్ని వెక్కిరిస్తుంది. అవును.. కుల, మత, లింగ అణచివేతకు వ్యతిరేకంగా అతను కవితాగానం చేస్తాడు. ʹఆమెʹ కన్నీటిని ఆవేదనపూరితంగా ఆలపిస్తాడు. కుల వ్యవస్థను నిలదీస్తాడు. శ్రమజీవితాల్ని కీర్తిస్తాడు.

ఆయ‌న ప్ర‌జా క‌వి. జ‌న జీవిత‌పు క‌ష్ట సుఖాల్ని త‌న క‌విత్వంలోకి ఒంపి.... గానం చేస్తాడు. క్యాంటీన్‌లో చాయ్ తాగుతూ... మ‌ధ్య మ‌ధ్య‌లో గుప్పు గుప్పున ఓ సిగ‌రేట్ కాల్చేసి త‌న క‌వితాలోకంలో మునిగిపోతాడు. క్యాంప‌సే అత‌ని ప్ర‌పంచం. బాదిత ప్ర‌జ‌లు, వాళ్ల పోరాటాలే అత‌ని క‌వితా వ‌స్తువులు. చ‌రిత్ర‌ను త‌వ్వి తోడి దోషిగా నిల‌బెడ‌తాడు. ʹఅది భార‌త్ కావ‌చ్చు... బ్రిట‌న్ కావ‌చ్చు... అమెరికా కావ‌చ్చు... ఇరాన్ కావ‌చ్చు. రాజ్యం ఎక్క‌డైనా... రాజ్య‌మే. ప్ర‌జ‌ల ప‌ట్ల అది క‌ర్క‌షంగానే ఉంటుందిʹ అంటాడు.

1983లో విద్రోహి విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న కారణంగా డిల్లీ జె. ఎన్. యూనివర్సిటీ నుంచి రెస్టికేట్ అయ్యాడు. కానీ అతను క్యాంపస్ వదిలి వెళ్లలేదు. “నా ఆత్మ ఇక్కడే ఉంది. నా ప్రేక్షకులూ ఇక్కడే ఉన్నారు” అంటూ తాను అక్కడే ఉండిపోయాడు. అతనికి క్యాంపస్లో ప్రతి ఒక్కరూ పరిచయం. విద్యార్థులు, అధ్యాపకులు అతనికి ఎంతో కొంత సాయం చేస్తుండేవారు. అలా క్యాంపస్నే తన ప్రపంచంగా మార్చుకున్న విద్రోహి... చాయ్, సిగరేట్, ప్రొయెట్రీతో.... ఎన్ని వేల రాత్రులు గడిపాడో అక్కడ. ఎన్నెన్ని హృదయాల్ని తట్టిలేపాడో. అలాంటి ఉద్యమ కవిని కోల్పోవడం నిజంగా బాధాకరం. కవీ... నీ జ్ఞాపకం శాశ్వతం. నీ గానం అజరామరం.

All are welcome to this evening of tribute.

Organizer
Lamakaan
This is a tribute to the voice of Dissent.