Shaheed Diwas - Poetry and Film
Movies
3.0 hrs
March 23, 2016 6:00 pm Wednesday
image

Inviting all for an evening of 'Shaheed Diwas' - A day of sacrifice where we remember our revolutioneries with poetry, prose reading and film viewing on this day of martyrdom of Bhagat Singh and his comrades. The vents will be in Telugu, Urdu and English.

All are welcome. Entry - Free.

సాయంత్రం 6గంట‌ల‌కు - క‌విత్వ ప‌ఠ‌నం

"రాజ్యాన్ని ప్ర‌శ్నించ‌ని వాడు క‌వి కాడు" అని విశ్వ‌సించి, ఆచ‌రించిన ప్ర‌జా క‌వులెంద‌రో ఈనేల‌పై ఉన్నారు. తాము ప్ర‌జా ప‌క్ష‌మ‌ని చాటి ప్ర‌జ‌ల మ‌దిలో శాశ్వ‌త స్థానం పొందిన క‌వులు వాళ్లు. "యువ‌త‌ర‌మా... న‌వ‌త‌ర‌మా... ఇదే అద‌ను.... క‌ద‌లిర‌మ్ము..." అంటూ యువ‌త‌ను ప్ర‌గ‌తిశీల భాట‌న న‌డిపించిన వాళ్లు. ష‌హీద్ భ‌గ‌త్ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆ అమ‌రుల స్మృతిలో ఈ సాయంత్రం. ప్ర‌ముఖ క‌వులు ఫైజ్ అహ్మ‌ద్ ఫైజ్‌, పాష్‌, మ‌ఖ్దూం మొహియొద్దీన్‌, శ్రీశ్రీ, చెర‌బండ‌రాజు, అలిశెట్టి ప్ర‌భాక‌ర్‌ల క‌విత్వంతో ఈ సాయంత్రం.

పానెల్‌

ఫైజ్ అహ్మ‌ద్ ఫైజ్ క‌విత్వం - న‌యీం మ‌ఖ్ధూం క‌విత్వం - వాహెద్‌ శ్రీశ్రీ క‌విత్వం - చందు చెర‌బండ‌రాజు క‌విత్వం - క్రాంతి అలిశెట్టి ప్ర‌భాక‌ర్ క‌విత్వం - న‌రేష్ కుమార్‌

సాయంత్రం 7గంట‌ల‌కు

వ‌ల‌సాధిప‌త్యాన్ని దిక్క‌రించి తిరుగుభాటు జెండానెగ‌రేసిన విప్ల‌వ వీరుడు భ‌గ‌త్ దేశ యువ‌త‌కు స్ఫూర్తి. సామ్రాజ్య‌వాదుల దోపిడీని అంత‌మొందించేందుకు "ఇంక్విలాబ్ జిందాబాద్" నినాద‌మిచ్చిన‌వాడు. పార్ల‌మెంటులో పొగ‌బాంబును వేసి స్వేచ్ఛా గీతాన్నాల‌పించిన భ‌గ‌త్‌సింగ్‌, రాజ్‌గుర్‌, సుఖ్‌దేవ్‌ల‌ను బ్రటీష్ ప్ర‌భుత్వం 1931 మార్చి 23న ఉరితీసింది. ఆ అమ‌రుల‌ను స్మ‌రించుకుంటూ... ష‌హీద్ దివ‌స్ సంద‌ర్భంగా........ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌.

Organizer
Lamakaan program committee
This event is organised to commemorate the revolutionaries of the system.