కథ చెపుతారా-StorytellingWorkshop
Workshop
2.0 hrs
July 15, 2017 11:00 am Saturday
ఈ విశ్వమంతా నిండివున్నవి కోట్లాది పరమాణువులు కాదు.. కోకొల్లలుగా చెప్పుకునే "కథలు"..
"కథ చెప్పడం" ఒక పెద్ద ప్రక్రియగా భావిస్తున్న ఈ రోజులలో, సులభంగా కథలు చెప్పే విధానం మీకు తెలియచేస్తాం.
మీ అందరూ సరదాగా, సులభంగా, కథలు చెప్పేందుకు సహకరించడమే మా ఈ ప్రయత్నం.
రండి .. కథల ప్రపంచంలో విహరిద్దాం...
Organizer
Katha Patasala
ఈ విశ్వమంతా నిండి వున్నవి కోట్లాది పరమాణువులు కావు…
కోకొల్లలుగా చెప్పుకొనే “కథలు”…
కాశీ మజిలీ కథలు, విక్రమార్క భేతాళ కథలు, చందమామ కథలు,
తాతయ్య చెప్పిన “నీతి కథలు”
ఆకాశంలో చుక్కల్ని చూపిస్తూ నాన్నమ్మ చెప్పిన “చిట్టడవి కథలు”
చందమామను చూపిస్తూ అమ్మ చెప్పిన “గోరుముద్ద కథలు”
నిద్రబుచ్చుతూ నాన్న చెప్పిన “సాహస కథలు”
చరిత్ర చెప్పిన రాజుల కథలు, అరేబియన్ నైట్స్ ఆలీబాబా కథలు..
రోమియో జూలియట్, లైలా మజ్ను “ప్రేమకథలు”
రామాయణ, మహా భారత, భాగవతాది “భారతీయ కథలు”
చెప్పుకుంటూ పోతే అనగనగా అంటూ మొదలై అంతంలేక మన జీవితాల్లో మమేకమైన కథలు మరుగున పడుతున్న సమయంలో.. తిరిగి ఆ కథలను బ్రతికించేందుకు మొదలైందే మన – “కథా పాఠశాల“.