Director K.Vishwanath B'day Spcl
Movies
3.0 hrs
February 19, 2020 1:30 pm Wednesday

విశ్వ 'నాదం' సినీ ప్రియులకు, కళాభిమానులకు స్వాగతం శాస్త్రీయ సంగీతానికి , నాట్య కళా సంస్ర్కృతికి తన సినిమాల్లో సమోన్నత స్థానమిచ్చి.. తెలుగు సాంప్రదాయానికి పట్టాభిషేకం చేసిన అద్వితీయ దర్శకుడు కళా తపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారు. ఈ నెల 19న ఆయన జన్మదినం సందర్భంగా లమాకాన్ వేదిక గా ఆయన సినిమాల్లోని సాహితీ విలువలు కలిగిన పలు గీతాల్ని ప్రదర్శిస్తున్నాం. అనంతరం ఆ పాటల గొప్పతనాన్ని, అందులోని సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ చర్చా కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా విశ్వనాథ్ గారి అభిమానులను, సినీ ప్రియుల్ని ఈ కార్యక్రమానికి సవినయంగా ఆహ్వానిస్తున్నాం . మూవీవాల్యూమ్ .కామ్ ఆధ్వర్యంలో జరగబోవు ఈ కార్యక్రమానికి అందరూ తప్పక విచ్చేయ ప్రార్ధన.

Organizer
MOVIEVOLUME.COM
Movie Volume LYK IT MEDIA LLP Previously we did MAYABAZAAR 60 YEARS, RAITU BIDDA, Ave Kallu 50 years, Gharana Mogudu 25 years etc shows